కృష్ణా: చల్లపల్లి మండల కేంద్రం నుంచి అయ్యప్ప మాలధారులు శబరిమలకు పయనమయ్యారు. గురువారం చల్లపల్లి నిమ్మలతోటలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో ముసంగి శివ గురుస్వామి 16 మంది మాలధారులకు అయ్యప్ప స్వాములు ఇరుముడులు కట్టారు. అనంతరం మాలధారులు మండల పూజా మహోత్సవానికి శబరిమల బయలుదేరారు.