NLR: తుఫాన్ల పేరుతో సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూ.17 కోట్ల పైగా అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మనుబోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మొంథా తుఫాన్ నైపద్యంలో ఒకే పనికి రకరకాల బిల్లులతో అవినీతికి పాల్పడ్డారన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.