దేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య రికార్డు స్థాయిలో లక్ష మార్కును (1,00,266) దాటింది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. 2015తో పోలిస్తే బంకులు డబుల్ అయ్యాయి. అయితే ఇందులో 90 శాతం వాటా ప్రభుత్వ సంస్థలదే కావడం విశేషం. ప్రైవేట్ కంపెనీలు ఉన్నా, ఇంధన విక్రయాల్లో సర్కారీ వారిదే హవా నడుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.