తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ‘జైలర్ 2’ మూవీలో షారుఖ్ ఖాన్ నటించనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నటుడు మిథున్ చక్రవర్తి హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్లు అతిథిపాత్రల్లో కనిపించనున్నట్లు తెలిపాడు. దీంతో ఈ సినిమాలో షారుఖ్ ఉండనున్నట్లు కన్ఫర్మ్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.