యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి ఎంపిక చేయాలని కాంగ్రెస్ MP శశిథరూర్ అభిప్రాయపడ్డారు. వైభవ్‌ను చూస్తుంటే తనకు చిన్ననాటి సచిన్‌ను చూసినట్లే ఉందని ఆయన పేర్కొన్నారు. సచిన్ తరహాలోనే వైభవ్ కూడా అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడని ప్రశంసించారు. వైభవ్ భారత్ సీనియర్ జట్టుకు ఆడటాన్ని చూడటం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన SMలో పోస్ట్ చేశారు.