NZB: చందూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్మికులకు గురువారం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. చలికాలంలో వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఘన్పూర్ సర్పంచ్ కృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.