MBNR: ఏసు కృప ప్రజలందరిపై ఉండాలని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కోత్వాల్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కల్వరి ఎంబి చర్చ్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దయా, కరుణ, ప్రేమ ప్రతి ఒక్కరిపై చూపించాలన్నదే యేసుప్రభువు యొక్క ఉద్దేశ్యమని ఆయన వెల్లడించారు.