NZB: మోపాల్లో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ రవికుమార్ గురువారం వార్డు సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, చెత్త సేకరణలో జాప్యం జరగకుండా చూడాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.
Tags :