»Dk Aruna And Jithender Reddy May Be Changed The Party
BJPకి గట్టి షాక్..!! పార్టీ వీడేందుకు ఇద్దరు నేతలు రెడీ
బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ అంటుండగా.. ఆయనకు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి తోడయ్యారు.
DK Aruna and Jithender Reddy May Be Changed the Party
DK Aruna and Jithender Reddy: తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు పీక్‌కి చేరాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), సీనియర్ నేత ఈటల రాజేందర్ (etela rajender) మధ్య పొసగడం లేదు. బండిని అధ్యక్షుడిగా కొనసాగించడంపై ఈటల గుర్రు మీద ఉన్నట్టు సమాచారం. అధ్యక్షుడిని మార్చాలని పట్టుబడుతున్నారట. స్టేట్ బీజేపీ చీఫ్ పదవీ ఇస్తే సరే.. లేదంటే ఆయన పార్టీని వీడే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి.
జూపల్లి మాట అదే..
ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు (jupally krishna rao) ఇదే విషయం చెప్పారు. పొంగులేటి (ponguleti srinivas reddy), తనతో కలిసి ఈటల రాజేందర్ (etala rajender) కలిసి రావాలని కోరారు. మరోవైపు బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీ వీడాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఉమ్మడి పాలమూరుకు చెందిన జేజమ్మ డీకే అరుణ (dk aruna), ఏపీ జితేందర్ రెడ్డి (jithender reddy) పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
డీకేతో బండికి విభేదాలు
బండి సంజయ్‌తో (bandi sanjay) డీకే అరుణకు (dk aruna) విభేదాలు ఏర్పడ్డాయట. కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ, బండి సంజయ్ (bandi sanjay) వ్యవహార శైలి కలిసి అరుణ (aruna) నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈటల రాజేందర్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవీ అప్పగిస్తే పార్టీలో కంటిన్యూ అవుతారట.. లేదంటే వీరు కూడా పార్టీ మార్పు తప్పదని హింట్స్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఈటలతో (etela rajender) జితేందర్ రెడ్డికి ర్యాపొ ఉండేది. సో.. జితేందర్ ఈటలతో కలిసి వెళ్లడానికి సిద్దంగా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.
జేజమ్మకు కాంగ్రెస్ నేతల ఆహ్వానం..?
బండి సంజయ్ (bandi sanjay) పాదయాత్ర చేసిన సమయంలో గద్వాలలో డీకే అరుణ (dk aruna) నుంచి పూర్తిగా మద్దతు రాలేదని బండి సంజయ్ (bandi sanjay) అనుచరులు భావిస్తున్నారు. ఆ విషయంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయట. ఈటలతో (etala) వెళ్లే అవకాశం ఉంది. లేదంటే సొంతగూటికి రావాలని అరుణకు (aruna) పిలుపు వచ్చిందట. సో.. ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగకుంటే.. ముగ్గురు కీలక నేతలు దూరం అయ్యే అవకాశం ఉంది. మరి దీనిపై బీజేపీ (bjp) హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకొనుందో చూడాలి మరీ.