GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామిని వనపర్తి ప్రధాన సబ్ కొర్టు న్యాయమూర్తి కళా అర్చన గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.