NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 27న ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.