అన్నమయ్య: తంబళ్లపల్లెకు నూతన ఎస్సైగా టీ.అనిల్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు జరిగిన బదిలీల్లో భాగంగా, గతంలో ఎస్సైగా పనిచేసిన ఉమాశంకర్ రెడ్డి రాయచోటి డీసీఆర్బీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తామని తెలిపారు.