E.G: రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ గోపాలపురం గ్రామానికి చెందిన రొంగల సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన గతంలో మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. బుధవారం పార్టీ అధిష్టానం నుంచి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.