MBNR: కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన గువ్వల శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ప్రస్తుతం గువ్వల శ్రీనివాసులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియకు సహకరించిన ఎంపీ అరుణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.