KRNL: పత్తికొండలో రైతులకు సంబంధించి అపరిష్కృత భూ రికార్డుల సమస్యల పరిష్కారానికి ఈనెల 26 నుంచి 31 వరకు స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు RDO భరత్ తెలిపారు. డివిజన్ పరిధిలోని 9 మండల తహసీల్దార్ కార్యాలయాల్లో రైతులు తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. ముఖ్యంగా చుక్కల భూములు, నిషేధిత జాబితాలో ఉండి రిజిస్ట్రేషన్ కాని భూముల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.