PDPL: పురగిరి క్షత్రియ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, చుంచు ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన పట్టణ కమిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా కర్రె రాజేశం, ముత్తినేని మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా చుంచు కనకయ్య, కోశాధికారిగా కర్రె ప్రవీణ్ ఎంపికయ్యారు. సంఘాన్ని బలోపేతం చేస్తూ కుల సంక్షేమం, ఐక్యత కోసం సమిష్టిగా పనిచేస్తామన్నారు.