NRPT: గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ డికే అరుణ అన్నారు. బుధవారం నారాయణపేటలో నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గెలుపొందిన బీజేపీ సర్పంచ్లను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు.