TG: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపించింది ఓ టీచర్. నాగర్ కర్నూల్(D) అచ్చంపేటలో NOV 25న లక్ష్మణ్ నాయక్(38) మరణించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఆయనను భార్య పద్మ ఊపిరాడకుండా చేసి చంపిందని తేల్చారు. రాత్లావత్ గోపి అనే మరో ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె ఈ హత్య చేసిందని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.