PDPL: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మతోన్మాద హత్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంథనిలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. హత్యాకాండలను ఖండించారు. హిందువులపై దాడులు సహించబోమని, రక్షణకు పోరాటం కొనసాగుతుందన్నారు.