KNR: జవహర్ నవోదయ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారని ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి ప్రశంసించారు. ఇటీవల లక్నోలో జరిగిన ఎస్జీఎఫ్ఎ పోటీల్లో నవోదయ విద్యార్థి శ్రీ హర్షిని జాతీయ స్థాయిలో 10వ స్థానం కైవసం చేసుకుందని తెలిపారు. అలాగే కన్యాకుమారిలో జరిగిన యోగా పోటీల్లో సాక్షిత్ జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని గెలుచుకున్నాడని చెప్పారు.