VSP: గాజువాకలో ATM కార్డు మార్పిడి ద్వారా మహిళను మోసం చేసిన కేసును విశాఖపట్నం సిటీ పోలీస్ వారం లోపే ఛేదించారు. క్రైమ్ నెం.551/2025లో తెలంగాణకు చెందిన బానోతు రాజు అలియాస్ నాయక్‌ను బుధవారం అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.50,500, 4 ATM కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ATM లావాదేవీలలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.