SDPT: మెనూ ప్రకారం కూరలు వండాలని, మీ ఇష్టానుసారం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ప్రజ్ఞాపూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య చేపట్టకుంటే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించారు.