రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటివరకు రూ.800కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమ ప్రాంతాన్ని చూపించి డబ్బులు సంపాదిస్తున్నారని, వసూళ్లలో తమకు వాటా ఇవ్వాలని పాకిస్తాన్ కరాచీలోని లయరీ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 50-80% వరకు తమకు ఇవ్వాలని, లేదంటే తమ ఊరిలో ఒక ఆసుపత్రి అయినా కట్టించాలని కోరుతున్నారు.