HYD: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు మున్సిపాలిటీల విలీనంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహానగరాన్ని మూడు ముక్కలు చేసిన తరువాత.. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చే ఆలోచనలో సర్కారు ఉందని విమర్శించారు. అసెంబ్లీలో సమస్యలన్నీ ప్రస్తావిస్తామని.. అయితే అక్కడ మా గొంతు నొక్కే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.