MDK: జీవాలలో నట్టల నివారణకు మందులను వాడాలని రాంపూర్ సర్పంచ్ నెల్లి రాజు పేర్కొన్నారు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో జీవాలకు నట్టాల నివారణ మందులను తాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని సర్పంచ్ రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో గోపాలమిత్ర శ్రీకాంత్, ప్రభాకర్ పాల్గొన్నారు.