ASR: ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ ఎస్సైగా పులఖండం నాని మంగళవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. విజయనగరం జిల్లాలో ట్రైనీ ఎస్సైగా పనిచేసిన ఆయన, గత కొన్ని రోజులుగా జీ. మాడుగుల పోలీసు స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా బాధ్యతలను నిర్వహించారు. ఎస్సైగా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ముంచంగిపుట్టు ఎస్సైగా ఆయన బాధ్యతలను స్వీకరించారు.