SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని నూతనంగా నియమితులైన జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా ఆయన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం రమేష్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో జిల్లా రాజకీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు.