ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సోదరి మరియా సోల్(32 ఏళ్ల) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది. అయితే, ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెస్సీ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఘటనతో జనవరి 3, 2026న జరగాల్సిన ఆమె వివాహం వాయిదా పడింది.