ATP: సైబర్ నేరాల ఛేదనలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి ఏబిసిడి అవార్డు సాధించిన రాయదుర్గం పోలీస్ బృందాన్ని MLA కాలవ శ్రీనివాసులు సన్మానించారు. R&B అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, సీఐలు వెంకటరమణ, జయనాయక్, ఎస్సై నాగమధులను అభినందించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నా నేరగాళ్ల ముఠాలోకి చొరబడి కేసు ఛేదించిన పోలీసుల సాహసం ప్రశంసనీయమన్నారు.