ADB: యువకులు దేశ రక్షణలో ముందుండటం అభినందనీయమని ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. అగ్ని, వాయు ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు మాజీ మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్‌ను శాంతినగర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానించి అభినందనలు తెలియజేశారు.