TG: హైదరాబాద్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TGRTC) ప్రత్యేక బస్సు సేవలను రేపటి నుంచి ప్రారంభించనుంది. “ఘర్ లక్ష్మి ఇన్ఫోబాన్” పేరుతో ఆఫీసులకు త్వరగా, సులభంగా చేరుకునేందుకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దిశగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.