NLR: టీడీపీ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులోని ప్రసన్న నివాసానికి వెళ్లిన జేసీ, ఆయనతో పాటు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పరస్పరం క్షేమసమాచారాలు తెలుసుకుంటూ స్నేహపూర్వక మాట్లాడుకున్నారు.