»Shooting Again In America Virginia Two Dead Five Injured
America: అమెరికాలో మళ్లీ కాల్పులు..ఇద్దరు మృతి
అమెరికా(America) వర్జీనియా(virginia)లోని రిచ్మండ్లోని హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్లో కాల్పుల(firing) ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికా వర్జీనియా(virginia) రిచ్మండ్లోని హై స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక వెలుపల మంగళవారం కాల్పులు(firing) జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో వేడుకకు హాజరైన వందలాది మంది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు పాల్పడిన 19 ఏళ్ల అనుమానితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా..అక్కడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. దీంతోపాటు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. హత్యకు గురైన వారిలో ఒకరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 ఏళ్ల పురుషుడు కాగా, మరొకరు గ్రాడ్యుయేషన్ కోసం అక్కడకు వచ్చిన 36 ఏళ్ల వ్యక్తి అని అధికారులు తెలిపారు. ఇక మిగతా వారి సమాచారం తెలియాల్సి ఉంది.
BREAKING: A mass shooting has taken place outside of a Richmond, Virginia High School Graduation celebration.
Details:
– 7 shot outside the Altria Theater in Richmond, Virginia
– The shooting took place in Monroe Park after the Huguenot High School graduation
ఆ క్రమంలో ఏర్పడిన గందరగోళంలో తొమ్మిదేళ్ల బాలిక పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ కారును ఢీకొట్టింది. ఆ క్రమంలో అనేక మంది వ్యక్తులు చిందరవందరగా పరుగులు తీసి కింద పడిపోయి గాయపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా అమెరికాలో పాఠశాలలు, షాపింగ్ కేంద్రాలు, చర్చిలు వంటి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కాల్పులు జరగడం ఒక చెడు కర్చర్ మాదిరిగా తయారైంది. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 2023లో మొదటి 157 రోజులలో ఇది 279వది కావడం విశేషం.