ELR: తమ చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా వాక్సిన్ వేయించాల్సిన బాధ్యత ప్రతీ తల్లిదండ్రులపై ఉందని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. జేవియర్ నగర్ లోని ఫిరంగులదిబ్బలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు కలెక్టర్ పోలియో వాక్సిన్ను వేశారు. మన రాష్ట్రంలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదన్నారు.