HYD: అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు ఫామ్ హౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. BRSLP సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగంగా ఏం మాట్లాడబోతున్నారనే అంశంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.