సత్యసాయి: తాడిమర్రి మండలం మరవపల్లి గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ధర్మవరం టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ శనివారం రాత్రి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.