విశాఖ: గోపాలపట్నంలో ఇటీవల జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గోపాలపట్నం పోలీస్స్టేషన్ జోన్-2 క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి వివరాల ప్రకారం.. వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను గుర్తించి, సుమారు 13.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఈ దర్యాప్తులో స్థానిక సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.