ADB: ఆధ్యాత్మిక మార్గం ఎంతో గొప్పదని, భక్తి మార్గంలో నడిచినప్పుడే శాంతి స్థాపన సాధ్యమవుతుందని జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారి గూడలో నిర్వహించిన శ్రీ మంగ అలివేలు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.