వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం కింద 100% సబ్సిడీతో రూ.75 వేల చొప్పున 8 యూనిట్లు అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి తెలిపారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. 55 ఏళ్లలోపు వయసు కలిగి, ఇదివరకు ఎలాంటి పథకం తీసుకోని అర్హులైన ట్రాన్స్జెండర్లు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని రాజమణి కోరారు.