SRPT: ఆకస్మిక వరదలు, అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న కోదాడలోని షిరిడి సాయి నగర్లో ‘మాక్ డ్రిల్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం ఎస్పీ నరసింహతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రాణనష్టం జరగకుండా వేగంగా స్పందించేందుకు ఈ కసరత్తు దోహదపడుతుందన్నారు.