ASF: డ్రీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నిక చేయబడిన పాఠశాలలకు సైన్స్ కిట్స్‌ను శనివారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడానికి ఈ సైన్స్ కిట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు చేతులతో ప్రయోగాలు చేయడం వలన అభ్యసన ఫలితాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని తెలిపారు.