ADB: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డి అన్నారు. భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారుచేసిన పలు రకాల వంటకాలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది మధుసూదన్, సురేష్, సంతోష్ తదితరులు ఉన్నారు.