NZB: ఆర్మూర్లో కళాశాల విద్యార్థినిలకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. విద్యార్థినులు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను, పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.