VZM: స్వచ్చాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయంలో MPDO రవికుమార్ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు. ఈ మేరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మండల పరిషత్ కార్యాలయం, సచివాలయాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.