AP: రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం జగన్ ఒక్కడే మేలు చేస్తాడని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పాలనలో అందరికీ మేలు చేశారని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలు సృష్టించారని చెప్పారు. 18 నెలల్లో చంద్రబాబు రూ.2.7లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. కూటమి పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.