TG: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే 10 రోజుల్లో దీనికి సంబంధించిన GO విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.