NRML: విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని చాటాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పాలిటెక్నిక్ ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు.