ASF: వాంకిడి మండలం బంబార ఉప సర్పంచ్‌గా 1వ వార్డు సభ్యుడు జాడి సంతోశ్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బెండర్ కృష్ణా విజయం సాధించగా, శనివారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికలో సంతోష్‌ను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఆయన నియామకం ఖరారు కావడంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.