GNTR: మంగళగిరి ప్రజల సేవలోనే ఎల్లప్పుడూ ఉంటానని మంత్రి లోకేశ్ అన్నారు. మండలంలోని ఆత్మకూరు పరిధిలో శనివారం కృపాసమాజం వారి ‘కృపాప్రాంగణం’ పునఃప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటానన్నారు.