TG: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బాపు అంటే ప్రతి యువకుడు ఆలోచన చేస్తాడని, బాపు విషయంలో కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.